ఫ్యాషన్, మోడలింగ్ పై ఆసక్తి గల యువతకు ప్రోత్సాహం అందించే విధంగా.. షో స్టార్ నిర్వాహకులు విజయవాడలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న యువతీయువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి హాజరై పోటీ పడ్డారు. ప్రతిభను ప్రదర్శించారు. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లాగే దక్షిణ భారత దేశ యువతకు కూడా ఒక ఫ్యాషన్ వేదిక ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు షో స్టార్ సీఈవో బిన్ని యాదవ్ తెలిపారు.
దక్షిణాదిలో మోడలింగ్, ఫ్యాషన్‌పై ఆసక్తి ఉన్న యువతీ, యువకులను ఒక వేదికపైకి తెచ్చేందుకు ఈ ఫ్యాషన్ షో నిర్వహించామని పేర్కొన్నారు. ఇప్పటికే పలు నగరాల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తైందని, ఇక్కడ విజయం సాధించిన వారికి హైదరాబాద్ లో తుది పోటీలు ఉంటాయని బిన్నీ యాదవ్ వెల్లడించారు.
ఇదీ చదవండి:
PERNI NANI: 'ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద.. నదిలోకి ఎవరూ వెళ్లొద్దు'