కృష్ణా నది కరకట్ట మీద నిర్మించిన తన రెండు భవనాలకు సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. నోటీసుల రద్దుపైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. 2003లో నిర్మించిన భవనాలకు సీఆర్డీఏ నోటీసులు ఎలా ఇస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సీఆర్డీఏ ఏర్పడక ముందే భవనాలను నిర్మించినందున.. ఆ నోటీసులు రద్దు చేయాలని ధర్మసనాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ సంజాయిషీ నోటీసులు మాత్రమే ఇచ్చామని... తుది నోటీసులకు గడువు ఉందని కోర్టుకు తెలిపారు. కరకట్టపైన నిర్మించిన భవనాల కూల్చివేతపై మరొకరికి ఇచ్చిన నోటీసులపై విచారణ సింగిల్ జడ్జీ ముందు పెండింగ్లో ఉందన్న అడ్వకేట్ జనరల్.. ఆ తీర్పు ఇంకా వెలువడాల్సి ఉందని కోర్టుకు వెల్లడించారు. ఇప్పుడే భవానాలను కూల్చబోమని కొంత సమయం ఇస్తామని వివరించారు. ఈ సమయంలో నోటీసులు రద్దు చేయడం సరికాదని కోర్టుకు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను 29కి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిచింది.
సీఆర్డీఏ నోటీసులపై... హైకోర్టులో "గోకరాజు"కు నిరాశ
కరకట్టపై తనకు చెందిన రెండు గృహాలకు ఇటీవలే సీఆర్డీఏ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు దీనికి నిరాకరించింది.