ETV Bharat / city

Ganesh immersion: గణేశ్​ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం ఇచ్చిన తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు..తీర్పుపై అభ్యంతరముంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.

గణేశ్​ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

author img

By

Published : Sep 13, 2021, 3:52 PM IST

హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ (POP) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం ఇచ్చిన తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్టు (TS High Court) నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు రివ్యూ పిటిషన్‌ వేశారు. ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పును సవరించాలని హైకోర్టును ప్రభుత్వ న్యాయవాది కోరారు. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.

సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని..కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా ? అని అడిగింది. జలాశయాలను కలుషితం చేసేందుకు మేం అనుమతి ఇవ్వాలా ? అని ప్రశ్నించింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. చట్టాలను ఉల్లంఘిస్తారా, అమలు చేస్తారా అనేది ప్రభుత్వ ఇష్టమని... తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని హైకోర్టు వెల్లడించింది.

తీర్పులో ఏం ఉందంటే...

హుస్సేన్​సాగర్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు గురువారం ఆదేశించింది. హుస్సేన్​సాగర్​లో గణేశ్​, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ (HMDA) ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతినిచ్చింది. ట్యాంక్​బండ్ వైపు విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు... పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు వైపు నుంచి చేసుకోవచ్చునని తెలిపింది.

రబ్బర్ డ్యాం...

హుస్సేన్​సాగర్​లో ప్రత్యేక రబ్బరు డ్యాం (Rubber Dam) ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది. దూర ప్రాంతాల నుంచి ఒకే రోజున హుస్సేన్​సాగర్​కు వెళ్లకుండా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వానికి హైకోర్టు పేర్కొంది. చిన్న చిన్న విగ్రహాలను ఇళ్లల్లోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని ఆదేశించింది. నిమజ్జనం రోజున జీహెచ్ఎంసీ (GHMC) ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ఉత్సవాల్లో లౌడ్ స్పీకర్లను (Loud Speaker) అనుమతించవద్దని తెలిపింది. నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎప్పటిలాగే వెంటనే వ్యర్థాలను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవీ చదవండి

కొనసాగుతున్న ఆనవాయితీ..వినాయకుడి పూజలో ముస్లిం సోదరులు

vinayaka chavithi foods: నోరూరించే సొరకాయ మోదక్

గణనాథుడికి ఇలా మొక్కుకుంటే.. మీ కోరిక తీరినట్లే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.