కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సచివాలయంలో ప్రవేశించేవారు 'ఆరోగ్య సేతు' యాప్ కలిగి ఉండాలని... లేకపోతే లోపలకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సందర్శకుల మొబైల్ ఫోన్లో ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయ ముఖ్య భద్రతా అధికారి దీనిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. సచివాలయ బ్లాక్‌ల్లో ప్రవేశానికి ముందు థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ యాప్‌లో ప్రమాద సూచిక వస్తే సదరు ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చూడండిం: 'గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్'