ETV Bharat / city

తొలివిడత వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభించాలి : సీఎం - ఏపీలో తొలివిడత వాటర్ గ్రిడ్ పనులు

రాష్ట్రంలో తొలివిడత వాటర్​గ్రిడ్ పనులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనులకు సంబంధించి ఏప్రిల్ 16 వరకూ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని, జూన్‌ మొదటి వారానికల్లా టెండర్లు ఖరారుచేయాలని అధికారులకు జగన్ సూచించారు.

తొలివిడత వాటర్ గ్రిడ్ పనులను వెంటనే ప్రారంభించాలి

author img

By

Published : Apr 10, 2020, 1:29 AM IST

రాష్ట్రంలో తొలివిడత వాటర్ గ్రిడ్ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వాటర్‌ గ్రిడ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన...తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో తొలివిడతలో చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి ఏప్రిల్‌ 16లోపు జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపాలని, జూన్‌ మొదటి వారంలోపు టెండర్లు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో వెంటనే వాటర్‌ గ్రిడ్‌ పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. దీనికోసం టెండర్లు ఖరారు చేయాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేయాల్సిన విలేజ్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణంపైనా..జగన్ సమీక్షించారు. కొవిడ్‌-19 లాంటి వైరస్​లు ప్రజారోగ్యానికి హాని చేస్తున్న దృష్ట్యా.. విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. వైద్యపరంగా మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు వీటి అవసరం ఉందన్నారు. వార్డు క్లినిక్స్‌ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఆర్బీకేలు, పాఠశాలల్లో నాడు-నేడు, గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. మార్చి 2021లోపు వీటి నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు.

ఇదీచదవండి

కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్లు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.