తెదేపా నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు వైఖరి నచ్చకే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నారు. తెదేపా నుంచి మద్దతు కరువైన అసహాయ పరిస్థితుల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారని పేర్కొన్నారు. సరైన అభ్యర్థులే లేని పరిస్థితుల్లో ఓటమిని కప్పిపుచ్చుకొనేందుకే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు జరగాయని.. అప్పుడు ఎన్నికలను ఎందుకు వాయిదా వేయలేదని ప్రశ్నించారు. ఓడిపోతామని తెలిసినా.. వర్ల రామయ్యను రాజ్యసభకు పోటీ చేయిస్తున్నారన్నారు. తన కుమారుడిని ఎందుకు రాజ్యసభకు పంపడం లేదని నిలదీశారు.
ఇదీ చదవండి: