అంబటి రాంబాబు అబద్ధాలు, మోసాలతో విశాఖ ఉద్యామాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని... తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన తన నోటికి తప్ప మెదడుకు పనిచెప్పట్లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చెప్పే అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. చంద్రబాబు విశాఖ ప్రసంగాన్ని వక్రీకరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రేణులను కోరారు.
ఇదీ చదవండి: ఎన్నికల విధుల నుంచి తప్పించాలని.. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పడిగాపులు