ETV Bharat / city

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు కక్ష సాధింపే: ఎల్.రమణ - cid notices to chandrababu

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం పట్ల తెెలంగాణ రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. వైకాపా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

telangana-state-tdp
telangana-state-tdp
author img

By

Published : Mar 16, 2021, 2:43 PM IST

Updated : Mar 16, 2021, 5:16 PM IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయటంపై తెలంగాణ తెదేపా నేతలు మండిపడ్డారు. ఏపీ రాజధానిలోని అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించిన 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెలంగాణ సీనియర్‌ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌. రమణ అన్నారు. ఒక ప్రభుత్వం పాలసీపై మరో ప్రభుత్వం ఎలా నోటీసులు ఇస్తుందని ప్రశ్నించారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చే అర్హత వైకాపాకు లేదన్నారు.

సీఐడి నోటీసుల జారీ చేసిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు. నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ పాలన సాగడం లేదని.. రాక్షస, ఉన్మాద పాలన సాగుతుందని ద్వజమెత్తారు. వైకాపా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఇదీ చదవండి

కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుకు సీఐడీ నోటీసులు: అచ్చెన్నాయుడు

Last Updated : Mar 16, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.