ETV Bharat / city

తెలంగాణ: ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్​ ఫలితాలు! - త్వరలో తెలంగాణ ఇంటర్​ ఫలితాలు

తెలంగాణలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్​ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.

telangana inter results likely to release on 15 or 16 of this june
'ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్​ ఫలితాలు'
author img

By

Published : Jun 13, 2020, 3:44 PM IST

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరింది. ఈనెల 15 లేదా 16న విడుదలయ్యే అవకాశం ఉంది.

గత నెల 12 నుంచి 30 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు. ప్రస్తుతం పత్రాల స్కానింగ్, మార్కుల అప్​లోడ్, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈనెల 15 నాటికి ప్రక్రియ అంతా పూర్తవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులకు చెందిన 53 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేశారు.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.