ETV Bharat / city

తెలంగాణ: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్ - Telangana mask fine

తెలంగాణలో రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి వేగంగా చెందుతోంది. రోజువారీ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. కానీ కొంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్

author img

By

Published : Apr 11, 2021, 6:24 PM IST

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేసింది. రాష్ట్రంలో బయట తిరిగే ప్రతిఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో మాస్కు లేకుండా తిరిగే వారికి రూ. 1,000 జరిమానా విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ప్రజారవాణా, ఇతర పనిప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు తప్పకుండా అమలు చేయాలని ఉత్వర్వుల్లో వెల్లడించారు.

ఇదీ చూడండి: దువ్వాడ సెజ్‌లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.