మాజీమంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్‌పార్క్ చేరుకొన్న ఆయన ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమతో కలిసి.. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో ఈటల రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగా అని ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. తెరాస బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల ఈనెల 14న భాజపాలో చేరడం ఖాయమైంది. తొలుత పలు పార్టీల నేతలో చర్చించిన ఆయన భాజపాలో చేరడానికే ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు ఇప్పటికే దిల్లీ వెళ్లి ఆ పార్టీ అగ్రనేతలను సైతం కలిసి వచ్చారు.
ఇదీ చదవండి: Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!