సంవత్సరానికో సంచలన కానుకలను తెలంగాణ ప్రజలకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెరాస ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆదినారాయణ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కొండ పోచమ్మకు గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తరలించి పంట పొలాలకు నీరందించారన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు.
ఇది చదవండి: 'ఇసుక రీచ్ నుంచి యార్డుకు వెళ్లే లోపే లారీలు మాయం..'