ETV Bharat / city

Suspension: ఉపాధ్యాయుడిపై కేసు నమోదు.. విధుల నుంచి తొలగింపు.. ఎందుకంటే?

ఎన్ని చట్టాలు చేసినా, కఠిన చర్యలు తీసుకున్నా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా తెగబడుతున్నారు. అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Teacher suspended with sexual allegations in sattenapally at guntur

author img

By

Published : Oct 25, 2021, 7:22 PM IST

Updated : Oct 25, 2021, 8:08 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో హుస్సేన్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులతో దారుణంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అతను వారి పట్లు నీచంగా ప్రవర్తించాడు. నీలి చిత్రాలు చూడాలంటూ.. విద్యార్థినులను వేధిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యార్థినుల ఆరోపణలు.. తల్లిదండ్రుల ఫిర్యాదు..

తమకు నీలిచిత్రాలు చూపిస్తూ వేధిస్తున్నారని.. విద్యార్థినుల ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరకు ఉపాధ్యాయుడు హుస్సేన్ ఉద్యోగం నుంచి సస్పెండ్​ అయ్యాడు.

ఇదీ చదవండి: పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం- తండ్రి ఆత్మహత్య!

Last Updated : Oct 25, 2021, 8:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.