రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వరదల(heavy rains and floods in ap) వల్ల జరిగిన నష్టాన్ని.. జాతీయ విపత్తుగా ప్రకటించి సహకారం అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు.. తెదేపా పార్లమెంటరీ(tdpp letter to pm modi and home minister amit shah) విజ్ఞప్తి చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా మారిందన్న టీడీపీపీ.. రోడ్డు, రైలు మార్గాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని తెలిపింది.
జాతీయ రహదారులకు గండ్లు పడటంతో.. ఎక్కడికక్కడ రాకపోకలు ఆగిపోయినట్లు తెదేపా పార్లమెంటరీ నేత గల్లా జయదేవ్ లేఖలో వివరించారు. ఈ మేరకు మోదీ, అమిత్ షాకు ఆయన విడివిడిగా లేఖలు రాశారు. ఇప్పటికీ వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం పునరుద్దరణ జరగలేదని.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 24 మంది మృతి చెందారని, 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ప్రజల జీవనాధారం దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు.
పట్టణాలు, గ్రామాలను వరద ముంచెత్తడంతో.. ప్రజలు నీరు, ఆహారం, ఔషధాలు సహా.. నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గల్లా జయదేవ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, దెబ్బతిన్న జాతీయ రహదారులు, రైలు మార్గాలను పునరుద్దరించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు. పంట నష్టంతో జీవనాధారం కోల్పోయిన రైతులను ఆదుకునేలా ఎక్స్‌గ్రేషియా అందించాలని, చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
CBN on Repeal 3 capital laws: ప్రజల దృష్టి మరల్చేందుకే బిల్లు ఉపసంహరణ డ్రామా: చంద్రబాబు