ETV Bharat / city

TDP Statewide Dharna on rates hike : పెరిగిన ధరలపై కదం తొక్కిన తెదేపా...రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు - tdp rallies in all districts on rate hikes

TDP Statewide Dharna on rates hike : పెరిగిన నిత్యవసరాల ధరలు తగ్గించాలంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. ధరలు దిగిరావాలి...జగన్ దిగిపోవాలంటూ ఆందోళనలు చేపట్టింది. పెరిగిన నిత్యవసరాల ధరలతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా పాలనలో పేదలు పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేకుండాపోయిందని మండిపడ్డారు.

TDP Statewide Dharna on rates hike
పెరిగిన ధరలపై కదం తొక్కిన తెదేపా...రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు..
author img

By

Published : Jan 11, 2022, 8:58 PM IST

పెరిగిన ధరలపై కదం తొక్కిన తెదేపా...రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు..

TDP Statewide Dharna on rates hike : పెరిగిన నిత్యవసరాల ధరలు తగ్గించాలంటూ తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు. ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలంటూ తెదేపా ఆందోళనలు చేపట్టింది. పెరిగిన నిత్యవసరాల ధరలతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారిందని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా పాలనలో పేదలు పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేకుండాపోయిందని మండిపడ్డారు.

నిత్యావసరాల ధరలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కదం తొక్కింది. ధరలు దిగిరావాలంటే..జగన్ దిగిపోవాలంటూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రతి పండగకు చంద్రబాబు కానుకలు ఇస్తే ఈ ప్రభుత్వం అవేమీ ఇవ్వకుండా పేదల జీవితాలతో ఆడుకుంటోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. డబ్బుల సంచులు తీసుకువెళ్లినా, కూరగాయలు మాత్రం సంచికి రావడంలేదని ధ్వజమెత్తారు. ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నూజివీడులో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమయంలో కనీసం పప్పు కూడా వండలేని స్థితిలో పేదలు ఉన్నారని మైలవరంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.

ఇదీ చదవండి : night curfew in ap: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వాయిదా.. ఎందుకంటే

నిత్యావసర సరుకుల ధరల పెంపుపై గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో.. ప్రజలకు సమాధానం చెప్పాలని తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజా నిలదీశారు. తాడికొండలో నిరసన ర్యాలీ చేపట్టారు. ధరలు దిగి రావాలి-జగన్ దిగి పోవాలని నినదించారు. నెల్లూరులో ధర్నా నిర్వహించారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరల పట్టికను వివరించారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు. సినిమా టిక్కెట్లు తగ్గించిన ముఖ్యమంత్రి నిత్యావసర ధరలు ఎందుకు తగ్గించలేకపోతున్నారని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బండిపై కూరగాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు.

ఇదీ చదవండి : AP State Women's Commission : మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అవసరం...

తిరుపతిలో తెలుగుదేశం శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పన్నుల భారానికి తోడు నిత్యావసరాల ధరలు ప్రజలను కుంగదీస్తొందని నేతలు మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని తెదేపా నాయకులు చంద్రగిరిలో టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో తాపీ మేస్త్రీలు ఎద్దుల బండిపై ఇసుక, సిమెంట్ బస్తాలు తలపై మోస్తూ నిరసన చేశారు. బుడగ జంగాల నాయకులు రోడ్డుపై భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఆటోవాలాలు తాళ్లతో ఆటో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. హిందూపురంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కూడలి నుంచి అంబేద్కర్ కూడలి వరకు మహిళలు నెత్తిన ఖాళీ కుండ, కట్టెలు పెట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై కూరగాయలు పారబోసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. తెలుగు మహిళలు రోడ్డుపై కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ పెరిగిన ధరల వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు.

ఇదీ చదవండి : Fake Oil Tankers Registration : ఆయిల్ ట్యాంకర్లు లేవు...కానీ రీ రిజిస్ట్రేషన్ మాత్రం అయిపోయింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.