Atchenna On OTS Scheme: ముఖ్యమంత్రి జగన్ తన పుట్టిన రోజున పేదల రక్తాన్ని పీల్చే పథకాన్ని ప్రవేశపెట్టడం చరిత్రలో నిలిచిపోతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రెండున్నర సంవత్సరాలలో సీఎం జగన్ ఒక్క ఇల్లైనా కట్టారా ? అని ప్రశ్నించారు. ఒక్క ఇల్లు కట్టకుండానే 32 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం దారుణమన్నారు. ఎక్కడ అప్పు దొరకని సందర్భంలో పేదవారిపై భారం వేస్తారా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో 7 లక్షల 82 వేల ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. చంద్రబాబుకు పేరొస్తోందని... టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.
పేదల వద్ద రూ.5 వేల కోట్లను దోపిడీ చేసేందుకే ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చారని అచ్చెన్న ఆరోపించారు. పేదలకు రిజిస్ట్రేషన్ పేరిట ఇస్తున్న పత్రాలు దేనికీ పనికిరావని అన్నారు. పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
"తెదేపా హయాంలో అన్ని హంగులతో 7.82 లక్షల ఇళ్లు నిర్మించాం. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లు పేదలకు అందించలేదు. ఒక్క ఇల్లు కట్టకుండానే 32 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రకటనలు చేసుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు విలువ లేదు. పేదలకు రిజిస్ట్రేషన్ పేరిట ఇస్తున్న పత్రాలు దేనికీ పనికిరావు. ఇళ్ల అమ్మకానికి హక్కులు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. వైకాపా ప్రభుత్వం కట్టని ఇళ్లపై రూ.5 వేల కోట్ల భారం వేస్తున్నారు." - అచ్చెన్న, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి
CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్