హిందూపురం అభివృద్ధిపై స్థానికులు ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైకాపా రౌడీలు దాడికి ప్రయత్నించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని లూఠీ చేసిన జగన్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడి చేయాలని సూచించారు.
జగన్ పాలనలో భౌతిక దాడులు పెరిగాయని, డీజీపీ విడుదల చేసిన క్రైమ్ రిపోర్ట్‌ను చూసైనా పాలకుల్లో మార్పు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి మర్చిపోయి రెండున్నరేళ్లు అయిందని, ప్రజాప్రతినిధి నివాసంపైనే దాడికి పాల్పడితే.. ఇక సామన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప వైకాపా చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు.
బాలకృష్ణ ఇంటివద్ద ఉద్రిక్తత..
MLA Balakrishna: అనంతపురం జిల్లా హిందూపురంలో.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ విషయమై తెదేపా, వైకాపా నాయకులు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అనంతరం బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలు పోటాపోటీగా జై జగన్, జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో.. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించటంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీచదవండి.