'వైకాపా పాలనలో మహిళలకు భద్రత లేదు' - tdp spokesperson Divyavani
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరగుతున్న అత్యాచారాలు పట్ల...కనీసం బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. అరాచక పాలనకు వైకాపా ప్రభుత్వం పరాకాష్టగా మారిందని ఆమె దుయ్యబట్టారు. దిశ చట్టాన్ని పకడ్బంధీగా అమల్లోకి తీసుకొస్తానని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రోజే... గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని... ఇంత వరకు ఆ కేసును పట్టించుకునే నాథుడు లేడని ఆమె విమర్శించారు. రాజధాని మహిళల పట్ల పోలీసుల వ్యవహారిస్తున్న తీరు చాలా అమానుషంగా ఉందన్నారు.