జగన్‌ది అర్ధరాత్రి ప్రభుత్వమనే విషయం ప్రజలకు అర్థమైందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. మాన్సాస్ ట్రస్ట్ నిర్ణయం, తెదేపా నేతల ఇళ్లు, సంస్థలు కూల్చివేత, ప్రజావేదిక విధ్వంసం ఇలా ప్రతి అంశంలో ముఖ్యమంత్రి అర్థరాత్రే నిర్ణయాలు తీసుకున్నారని ఆమె మండిపడ్డారు. నోరున్నోళ్లదే రాజ్యం, అధికారం ఉన్నోళ్లదే రౌడీయిజం అన్న రీతిలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రి వయస్సున్న చంద్రబాబును జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలంతా ఛీ కొడుతున్నారని విమర్శించారు. తూలనాడటం, అవమానించడం ద్వారా అధికార పార్టీ తనను తానే అవమానించుకుందని ఆక్షేపించారు. రైతుల పక్షాన చంద్రబాబు ప్రశ్నించారు కాబట్టే రాత్రికి రాత్రి పంటల బీమా ప్రీమియం సొమ్ము విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:
'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'