ETV Bharat / city

జగన్ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు.. "ప్రజా ఛార్జిషీట్" విడుదల చేసిన తెదేపా

author img

By

Published : Mar 9, 2022, 1:34 PM IST

Updated : Mar 10, 2022, 4:06 AM IST

Charge sheet on Jagan Mistakes: సీఎం జగన్ రెడ్డి తన వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారంటూ తెదేపా "ప్రజా ఛార్జిషీట్" విడుదల చేసింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రత్యేక సంచికను.. తెదేపా నేతలు విడుదల చేశారు. ప్రజా వేదిక కూల్చివేత, అమరావతి ఉసురు తీయడంతో మొదలైన విధ్వంసక పాలన నిరాటంకంగా కొనసాగుతోందని నేతలు దుయ్యబట్టారు.

tdp released Chargesheet on jagan mistakes
సీఎం జగన్ తప్పులపై ప్రజా ఛార్జిషీట్ విడుదల చేసిన తెదేపా

Charge sheet on Jagan Mistakes: ముఖ్యమంత్రి జగన్‌ వెయ్యి రోజుల పాలనలో అడుగడుగునా ఘోరాలు, విధ్వంసాలు, నేరాలు, లూటీలు, అబద్ధాలే తప్ప.. అభివృద్ధికి తావే లేదని ప్రధాన ప్రతిపక్షం తెదేపా మండిపడింది. ప్రజా వేదిక కూల్చివేత, అమరావతి ఉసురు తీయడంతో మొదలైన విధ్వంసక పాలన నిరాటంకంగా కొనసాగుతోందని దుయ్యబట్టింది. జగన్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనలో 1000 నేరాలు- ఘోరాలు- లూటీలు- అసత్యాలపై ప్రజా ఛార్జిషీటు పేరుతో 60 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. దీనిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నక్కా ఆనందబాబు, చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు.

ప్రజా ఛార్జిషీట్ విడుదల చేసిన తెదేపా

‘ముఖ్యమంత్రి చేస్తున్న నేరాల్ని, ఘోరాల్ని, దుర్మార్గాల్ని తెదేపా ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూనే ఉంది. మరోసారి వాటన్నిటినీ రాష్ట్ర ప్రజలు, విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, రాష్ట్ర శ్రేయస్సు కోరేవారికి తెలియజెప్పేందుకే ఈ పుస్తకాన్ని విడుదల చేశాం. జగన్‌ ప్రజా వేదికను కూల్చేసి అశుభ కార్యంతో పాలన మొదలుపెట్టారు. జగన్‌ పాలనలో రాష్ట్రం దివాలా తీస్తుందని, ఏపీ సర్వనాశనమై ప్రజలు ఈసురోమంటారని అప్పుడే అనుకున్నాం. మేం ఊహించిన దానికంటే దారుణంగా ఆయన పాలన సాగింది. మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అమరావతిని ఒక కులానికి, ప్రాంతానికి ఆపాదించి దుష్ప్రచారం చేశారు. మత విద్వేషాలకు ఆజ్యం పోశారు. జగన్‌ నిర్వాకంతో 139కి పైగా సంస్థలు ఇతర ప్రాంతాలకు పారిపోయాయి. వైకాపా పాలనలో ఇప్పటి వరకు 220కి పైగా దేవాలయాలపై దాడులు జరగడం జగన్‌ అసమర్థత కాదా?’ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

‘తాడేపల్లిలోని తన రాజప్రాసాదం చుట్టూ పేదలు ఉండకూడదని వారి గుడిసెల్ని తొలగించారు. వారేమైనా ఉగ్రవాదులా? అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాల్ని ధ్వంసం చేయించారు. స్వయంగా చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేయించారు. దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుని, ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు’ అని మండిపడ్డారు.

మాట తప్పారు.. మడమ తిప్పారు

జగన్‌ పాలనలో మొత్తం వెయ్యి అంశాల్ని వివిధ శీర్షికల కింద గుదిగుచ్చి తెదేపా ఈ పుస్తకం ప్రచురించింది. ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు, నెరవేర్చని హామీలు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం, అమరావతిని ధ్వంసం చేయడం, పోర్టుల్లో ప్రభుత్వ వాటాల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, నిధుల దుర్వినియోగం, వివిధ సంస్థలు, శాఖల నిధుల దారి మళ్లింపు, దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం, దాడులు, స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, శాసన, రాజ్యాంగ వ్యవస్థలపైనా, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు, తెదేపా నేతల అక్రమ అరెస్టులు వంటివన్నీ పొందుపరిచారు.

గవర్నర్‌ అయినా స్పందించరే?

గవర్నర్‌ పేరు మీదే నిబంధనలకు విరుద్ధంగా అప్పులు తీసుకొచ్చారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ జీవో 2430 తెచ్చారు. మంచి చెడ్డలు ఆలోచించకుండా మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్‌ సంతకం పెట్టారు. వీసీలపై అక్రమ కేసులు పెట్టినా.. ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ వారిని కాపాడలేకపోయారు. నేర చరితుల్ని ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆమోదం తెలిపారు. శిరోముండనం బాధితుడి విషయంలో రాష్ట్రపతి స్పందించినా గవర్నర్‌ స్పందించలేదు. సీబీఐపైనా ఈ ప్రభుత్వం దాడికి దిగుతోంది.

సాగునీటి ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రూ.1.05 లక్షల కోట్లు అవసరం. కానీ వైకాపా ప్రభుత్వం 2021-22లో వీటిపై కేవలం రూ.3,354 కోట్లు ఖర్చు పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని గాలికొదిలేశారు. గత ఎన్నికల్లో జగన్‌ గెలుపునకు కేసీఆర్‌ సహకరించారు. అందుకే నదీ జలాల విషయంలో జగన్‌ మెతక వైఖరితో రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారు. కృష్ణా నదికి ముఖద్వారం వంటి జూరాల ప్రాజెక్టును కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని ఒత్తిడి చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు

హిందూ మతం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. 226కి పైగా దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసం, దాడులు జరిగినా ఏ ఘటనలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. తిరుమల పవిత్రతను పథకం ప్రకారం దెబ్బతీస్తున్నారు. తితిదే బోర్డు ఆహ్వానితుల జాబితాలో నేరస్థుల్ని, ఆర్థిక నేరగాళ్లను చేర్చారు. విశాఖలో రూ.కోట్ల విలువ చేసే సింహాచలం ఆలయ భూముల్ని విజయసాయిరెడ్డి అనుచరులు ఆక్రమించారు’ అని ఛార్జిషీటులో పేర్కొన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలపై దాడి: చినరాజప్ప, మాజీ ఉపముఖ్యమంత్రి

మేం విడుదల చేసిన ప్రజా ఛార్జిషీటు ప్రజల హృదయాల్లో నుంచి పుట్టిందే. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావాలంటేనే భయపడే పరిస్థితి జగన్‌ తీసుకొచ్చారు. గవర్నర్‌ను పక్కనపెట్టి రాజ్యాంగ వ్యవస్థలపైనా, న్యాయవ్యవస్థపైనా దాడి చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహం: నక్కా ఆనందబాబు

జనాభాలో 25 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీల్ని, 50 శాతానికిపైగా ఉన్న బీసీల్ని మోసపూరిత వాగ్దానాలతో జగన్‌ వంచించారు. ఎస్సీ, ఎస్టీలకు తీరని ద్రోహం చేశారు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే, జగన్‌ వెయ్యి తప్పులు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌ను ఓడించి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు.

ప్రజా ఛార్జిషీటులో ముఖ్యాంశాలివీ..

  • అమరావతి ఉసురు తీసి.. 175 నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు సమకూర్చగల రూ.2 లక్షల కోట్ల ఆస్తిని నిరర్ధకం చేశారు.
  • కియా పరిశ్రమపై దాడి చేసి 16 అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడానికి కారణమయ్యారు.
  • మద్యం రేట్లు పెంచి రూ.15వేల కోట్లు, ఇసుక మాఫియాతో రూ.10వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌ లూటీ చేసింది.
  • డ్రగ్స్‌, గంజాయి మాఫియాల నుంచి రూ.10వేల కోట్లు.. ఎర్రచందనం, గనుల అక్రమ తవ్వకాల్లో మరో రూ.10వేల కోట్లు కొల్లగొట్టారు.
  • సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు మింగేశారు.
  • రేషన్‌ బియ్యాన్ని స్మగ్లింగ్‌ చేసి రూ.4వేల కోట్లు దోచుకున్నారు. ఇలా అనేక రకాలుగా రూ.లక్ష కోట్లకు పైగా లూటీ చేశారు.
  • ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడానికి రూ.3,500 కోట్లు దుబారా చేశారు.
  • జగన్‌రెడ్డి ప్రభుత్వంలో 50 మందికిపైగా సలహాదారులున్నారు. ప్రజాధనాన్ని భోంచేయడం తప్ప వారివల్ల వీసమెత్తు ప్రయోజనం కనిపించడం లేదు.
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో 48 చోట్ల అభ్యర్థుల్ని కిడ్నాప్‌ చేసి, 118 చోట్ల అభ్యర్థుల ఆస్తులు ధ్వంసం చేశారు. ముగ్గుర్ని హత్య చేశారు. 332 మందిపై అక్రమ కేసులు పెట్టారు.
  • పోలీసులు, వైకాపా నాయకుల వేధింపులవల్లే నంద్యాలలో అబ్దుల్‌ సలాం.. భార్యాబిడ్డలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

    జగన్‌ది మోసకారి సంక్షేమం
  • అమ్మఒడికి రూ.14వేలు ఇస్తున్నారు. మరోవైపు మద్యం ధరలు పెంచి నాన్న జేబులో నుంచి రూ.70వేలు కొట్టేస్తున్నారు.
  • ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు ఇచ్చి.. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, జరిమానాలు పెంచి రూ.30వేలు లాక్కుంటున్నారు.
  • బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కుదించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,800 పదవుల్లో కోత పెట్టారు. ఆదరణ పథకం రద్దు చేసి, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.18,226 కోట్లు దారి మళ్లించారు.
  • ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.3,548 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.878 కోట్లు, మైనారిటీల నిధులు రూ.1483 కోట్లను దారి మళ్లించారు.
  • రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని.. రూ.7,500కు కుదించారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 10, 2022, 4:06 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.