ETV Bharat / city

విద్యుత్ ఛార్జీల పెంపుపై తెదేపా పోరుబాట - tdp latest updates

ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల భారం మోపుతుందంటున్న తెలుగుదేశం ఛార్జీల పెంపు అంశంపై ఈ నెలలో ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో దశలవారీగా ప్రజలపై దాదాపు 11వేల కోట్ల పైచిలుకు విద్యుత్‌ ఛార్జీల భారం మోపిందని తెదేపా ఆరోపిస్తోంది.

విద్యుత్ ఛార్జీల ఆంశంపై ఆందోళన తీవ్రతరం చేయనున్న తెదేపా

author img

By

Published : Oct 4, 2021, 2:05 AM IST

Updated : Oct 4, 2021, 5:09 AM IST

ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల భారం మోపుతుందంటున్న తెలుగుదేశం ఛార్జీల పెంపు అంశంపై ఈ నెలలో ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్​బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు ఆపార్టీ ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచి పదో తేదీ వరకూ మీడియా, సామాజిక మాధ్యమాల ధ్వారా విధ్యుత్ ఛార్జీల భారంపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. 11 నుంచి 17 వరకు గ్రామ మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురానుంది. 18 నుంచి 24 వరకు తెదేపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జులు గ్రామాల్లో పర్యటించి, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలతో చర్చిస్తారు. 25 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర జోనల్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతారు.

ఇదీ చదవండి:

'వైకాపా అధికారంలోకి వచ్చాక పల్నాడులో రౌడీయిజం పెరిగింది'

Last Updated : Oct 4, 2021, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.