వైకాపా ప్రభుత్వం ఏడాదిన్నరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని విస్మరించినందుకే అది అటకెక్కిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. వైకాపా ప్రభుత్వ చేతకానితనాన్ని తెదేపాపై నెట్టడం అర్థరహితమని మండిపడ్డారు.
"తెదేపా కృషి వల్లే రూ.55,548 కోట్ల పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం అంగీకారం తెలిపింది. రాజ్యసభ, దిల్లీ హైకోర్టు సహా వివిధ సందర్భాల్లో ఇదే అంశాన్ని కేంద్రం ధ్రవీకరించింది. పోలవరంపై మంత్రి అనిల్‌కు ఏం తెలుసని మేం సమాధానం చెప్పాలి. ఆయన జలవనరుల మంత్రిగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం. ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చును కేంద్రం భరించటంతో పాటు అంచనా బాధ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అప్పగిస్తున్నట్లు 2017 మార్చి 15 కేబినెట్ నోట్లో ఉంది. ఇరిగేషన్ కంపోనెంట్లోనే ఆర్అండ్ఆర్ భూసేకరణ కలిపి ఉంటుందనే విషయం మంత్రి తెలుసుకోవాలి. కేబినెట్ నోటు చదివినా అర్థంకాక ఏదిపడితే అది మంత్రి అనిల్ మాట్లాడుతున్నారు. బెట్టింగ్ ముఠా నాయకుడైన అనిల్..420 సీఎంకు భక్తుడిగా వ్యవహరించటంలో ఆశ్చర్యం లేదు." అని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు 69.5శాతం పూర్తైనట్లుగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చిన వీడియోను పట్టాభి మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
ఇదీచదవండి