కేంద్రప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తమను నిరాశకు గురిచేసిందని.... తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం హయాంలో బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కోసం కొట్లాడామన్న గల్లా... ప్రస్తుతం 28 మంది ఎంపీలున్న వైకాపా ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు.
వైకాపా నేతలపై కేసులు రాష్ట్రానికి దురదృష్టంగా మారాయి
రాష్ట్రానికి రూపాయి తేలేని స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని తెదేపా ఎంపీ కనకమేడల విమర్శించారు. దిల్లీలో రాష్ట్రాన్ని పట్టించుకోని పరిస్థితి తీసుకొచ్చారని వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం పునరావాస నిధులు అడగలేని స్థితిలో ఉన్నారని ఆక్షేపించారు. వైకాపా నేతలపై కేసులు రాష్ట్రానికి దురదృష్టంగా మారాయని విమర్శించారు.
ఇదీచదవండి: నిర్మలమ్మ '2021 బడ్జెట్' హైలైట్స్ ఇవే...