కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ముస్లిం సమాజానికి నష్టం చేకూరేలా ఉందని తెదేపా ఎంపీ కేశినేని అన్నారు. వ్యక్తిగతంగా తాను బిల్లును వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఈ బిల్లు లౌకికవాదానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. బిల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ముస్లింల పట్ల సీఎం జగన్కు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా.. రాష్ట్రంలో ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచినందుకు ఎంపీ కేశినేనిని విజయవాడ ఆయా సంఘాల నాయకులు సన్మానించారు.
ఇదీ చదవండి : బంగాల్లో 'పౌర' ఆందోళనలు తీవ్రం.. ఈశాన్యాన తగ్గుముఖం