అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తిడితేనే.. ఎంపీ బెల్లాని చంద్రశేఖర్‌ను పార్టీలో ఉండనిస్తామనే ఆదేశాలు అధిష్టానం నుంచి వచ్చాయా? అని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నిలదీశారు.
"అశోకగజపతి రాజు చరిత్ర తెలిసి కూడా విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి ఆదేశాలతోనే.. విజయనగరం ఎంపీ రాజకీయ పబ్బం కోసం విమర్శలు చేస్తున్నారు. లక్షల కోట్లు విలువ చేసే వేల ఎకరాలు దానం చేసిన చరిత్ర గజపతిరాజులది అయితే.. లక్షల కోట్లు అవినీతికి పాల్పడి దోపిడీ చేసిన చరిత్ర వైకాపా నేతలది. కరోనా తీవ్రతలో పన్నుల భారం మోపుతూ గజపతిరాజులు పన్నులు వసూలు చేశారని విమర్శించటం విడ్డూరం. దొడ్డిదారిన సంచయితను తీసుకొచ్చిన విజయసాయి.. న్యాయస్థానం తీర్పును దిక్కరిస్తూ అశోక్ గజపతిరాజుపై నిందలు వేస్తున్నారు." అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
CM Letter To PM: 'ప్రైవేటు ఆస్పత్రులు వాడని కొవిడ్ వ్యాక్సిన్లను ప్రభుత్వం సేకరించాలి'