తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు పూర్తై కార్యకలాపాలు ప్రారంభించిన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని జగన్రెడ్డి మళ్లీ ప్రారంభించటం పిచ్చికి పరాకాష్ట అని ఎమ్మెల్సీ బీటీనాయుడు దుయ్యబట్టారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన 18నెలల్లో భూసేకరణ, ఇతర పనులు పూర్తిచేసి చంద్రబాబు ప్రారంభించారని గుర్తు చేశారు. 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ..' అన్నట్లుగా జగన్రెడ్డి ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు. రెండేళ్లలో కొత్తగా ఒక్క ప్రాజెక్టుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనులకు పేర్లు, రంగులు మార్చడం మాని కొత్తగా రాష్ట్ర అభివృద్ధికి జగన్ చిత్తశుద్ధితో పని చేయాలని హితవు పలికారు. కొన్ని రోజులు పోతే కొండారెడ్డి బురుజును కూడా వైకాపా ప్రభుత్వం కట్టిందంటూ మళ్లీ రిబ్బన్ కట్ చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: రాజధాని వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ