కేవలం ఛాయ్, బిస్కెట్లు తినేందుకే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క నిర్ణయం మంత్రివర్గంలో తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయికి 100 ప్రచారం తప్ప ఏమీ లేదని, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో జాబ్ క్యాలెండర్‌పై చర్చించేవాళ్లని మండిపడ్డారు. యువతను వైకాపా ప్రభుత్వం నిలువునా మోసం చేసినందున.. జాబ్ క్యాలెండర్ మార్చేవరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
cabinet decisions: కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..