తెదేపా ఎమ్మెల్యే సాంబశివరావు వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కమీషన్ల కోసమే కరకట్ట పనులు చేపట్టారని ఆయన ఆరోపించారు. భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని.. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి స్వార్థ నిర్ణయంతో 5 కోట్ల మంది ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
565 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే కేసులు పెడతారా? అంటూ దుయ్యబట్టారు. రూ.250 కోట్లతో చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించి 80 శాతం పూర్తి చేశారన్నారు. వైకాపా నేతలు అక్రమంగా తోడుకుంటున్న గ్రావెల్, ఇసుక రవాణాకు మార్గం సుగుమం చేసేందుకు కరకట్ట పనులు చేపట్టారని ఆరోపించారు. రాజధానికి ఇచ్చిన భూముల్లో 1689 ఎకరాలను బిల్డ్ ఏపీ కింద అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రజల ఆస్తులను అమ్ముకుంటూ చేసేది పరిపాలనా? అని నిలదీశారు. మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల్లో భూకబ్జాలు తప్ప మూడు తట్టల మట్టి కూడా వేయలేదని ఎమ్మెల్యే సాంబశివరావు విమర్శించారు.
ఇదీ చదవండి: Tulasi Reddy: 'సీఎం జగన్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది'