మత్తు వైద్యుడు సుధాకర్ మరణంపై సమాధానం చెప్పలేకనే వైకాపా నేతలు.. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ఎస్సీలు సలహాదారులుగా పనికిరారని అసెoబ్లీ సాక్షిగా అవమానించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాపై ప్రశ్నించినందుకు ఎస్సీ యువకునికి శిరోముండనం చేసి జాతి మొత్తాన్ని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలు అంటరాని వారన్నట్లుగా… రోజా మాట్లాడలేదా అని ధ్వజమెత్తారు. మంత్రి అవంతికి, ఎస్సీలపై అంత ప్రేమ ఉంటే వైకాపా పాలనలో వారికి జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. సలహాదారుల్లో, నామినేటెడ్ పదవుల్లో ఎంత మంది ఎస్సీలున్నారని జగన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: సీబీఐ డైరెక్టర్ రేసులో ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి కౌముది..!