ETV Bharat / city

'108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహ‌ణ‌లో 307 కోట్ల కుంభ‌కోణం' - 108 వాహనాల కుంభ‌కోణం

ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప్రతి స్కామ్‌లో భాగ‌స్వామేనని తెదేపా అధికార ప్రతినిధి ప‌ట్టాభి విమర్శించారు. 108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహ‌ణ‌లో 307 కోట్ల భారీ కుంభ‌కోణం జ‌రిగిందన్నారు. సాక్ష్యాధారాల‌తో తాము బ‌య‌టపెడుతున్న వాటిపై ఏసీబీ ఏం చర్య తీసుకుంటుందని నిలదీశారు.

'108 వాహనాల కోనుగోళ్లు, నిర్వహ‌ణ‌లో 307 కోట్ల కుంభ‌కోణం'

author img

By

Published : Jun 21, 2020, 4:31 PM IST

108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహ‌ణ‌లో 307 కోట్ల భారీ కుంభ‌కోణం జ‌రిగిందని తెదేపా అధికార ప్రతినిధి ప‌ట్టాభి ఆరోపించారు. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప్రతీ స్కామ్‌లో భాగ‌స్వామేనని విమర్శించారు. బీవీజీ సంస్థకు 2020 డిసెంబ‌రు వ‌ర‌కు 108 వాహనాల నిర్వహణ ఒప్పందం అమ‌లులో ఉంటే...ఇప్పుడు అర‌బిందో ఫౌండేష‌న్ వారికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సాక్ష్యాధారాల‌తో తాము బ‌య‌టపెడుతున్న వాటికి ఏసీబీ ఏం చర్య తీసుకుంటుందని నిలదీశారు.

పోలీస్ శాఖకు ఆధారాలు, జీవోల‌తో స‌హా పంపిస్తామని.., నిందితులను అరెస్ట్ చేసే ద‌మ్ముందా? అని సవాల్‌ విసిరారు. అంబులెస్స్ నిర్వహ‌ణ‌ను క‌మిష‌నర్ హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్​కు ఎందుకు మార్చారని నిలదీశారు. రాజ‌శేఖర్​రెడ్డి అనే అర్హత లేని వ్యక్తిని డిప్యూటీ సీఈవోగా కుర్చోబెట్టి మళ్లీ వెంటనే ప‌దోన్నతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అర‌బిందో ఫౌండేష‌న్ ఛైర్మన్ రామ్ ప్రసాద్​రెడ్డి.. విజ‌య‌సాయి రెడ్డికి ద‌గ్గర బంధువు కాబట్టి 108 కాంట్రాక్టు ఆయనకి ఇచ్చారని ఆరోపించారు. 341 పాత‌ అంబులెన్స్​లో 185 కోట్లు...,432 కొత్త వాటికి 122 కోట్లు దోచిపెడుతున్నారని విమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.