ETV Bharat / city

TDP Slams on YSRCP: సన్ రైజ్ స్టేట్​గా ఉన్న రాష్ట్రాన్ని.. కరెప్షన్ రైజ్ స్టేట్​గా మార్చారు: తెదేపా

వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తెదేపా హయాంలో సన్ రైజ్ స్టేట్​గా ఉన్న రాష్ట్రం.. జగన్ అధికారంలోకి వచ్చాక కరెప్షన్ రైజ్ స్టేట్​గా మారిందని తెదేపా నేత కళా వెంకట్రావు ధ్వజమెత్తారు.

tdp leaders slams on ysrcp
వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు
author img

By

Published : Dec 7, 2021, 4:38 PM IST

Tdp leader kala venkata rao slams on ysrcp: యజ్ఞంలా సాగుతున్న మహాపాదయాత్రను వైకాపా నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు. తెదేపా హయాంలో సన్ రైజ్ స్టేట్​గా ఏపీ ఉంటే... జగన్ అధికారం చేపట్టాక కరెప్షన్ రైజ్ స్టేట్​గా మారిందని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు అవినీతిలో మునిగి రాష్ట్రాన్ని అప్పులతో ముంచుతున్నారని ఆరోపించారు.

రైతులు సంకల్ప బలంతో 37 రోజులుగా సాగుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో వైకాపాకు గుబులుపుట్టిందని దుయ్యబట్టారు. కనీసం అన్నం తినడానికి కూడా స్థలాలు కేటాయించకుండా బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. తలదాచుకోవడానికి నీడ లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

ఏటా 2,500కోట్ల బాదుడుకు వైకాపా​ శ్రీకారం: పట్టాభి

Tdp leader pattabhi on Housing scheme: పేదల ఇళ్లస్థలాల ముసుగులో తాజాగా ఏటా రూ. 2,500కోట్ల బాదుడు కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగా ప్రతి లే అవుట్​లో 5శాతం భూమి లేదా దాని ఖరీదుని ప్రభుత్వానికి చెల్లించాలని వైకాపా ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని 13జిల్లాల్లో 20వేల ఎకరాల్లో లే అవుట్లు వేస్తున్నారని.. ఆ లెక్కన 5శాతం భూమి అంటే 1000ఎకరాలు లేదా దాని విలువ రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమీ వాటి సొంత ఖజానా నుంచి ప్రభుత్వానికి కప్పం కట్టవన్న పట్టాభి... అంతిమంగా భూమి కొనేవారినుంచే వసూలు చేస్తారని అన్నారు. ఈ మేరకు జగనన్నకు రియట్ ఎస్టేట్ కంపెనీలు కట్టబోయే రూ. 2,500కోట్లు పేదలు నుంచే ముక్కుపిండి వసూలు చేస్తారన్నారు. 5శాతం భూమిపేరుతో లే అవుట్లు, రియల్ ఎస్టేట్ వారినుంచి ఏటా రూ. 2,500కోట్ల బాదుడు కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పట్టాభిరామ్‌ పేర్కొన్నారు.

జగన్ చర్యల వల్ల వ్యవసాయరంగం కుదేలు: జవహర్

TDP Leader Jawahar on Agriculture: సీఎం జగన్.. రాష్ట్రంలో వరి పంటకు ఉరి వేశారని మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ మండిపడ్డారు. జగన్ చర్యల వల్ల వ్యవసాయరంగం పూర్తిగా కుదేలైందన్నారు. వ్యవసాయశాఖ మంత్రికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని విమర్శించారు. వరి పంట వేయద్దు అని చెప్తున్న మంత్రి కన్నబాబు.. గంజాయి పంట వేయిస్తారా? అని జవహర్‌ దుయ్యబట్టారు. కేసీఆర్ కేంద్రంతో పోరాడుతుంటే సీఎం జగన్ ఇంట్లో పిల్లిలా పడుకున్నారన్నారు. రైతు ప్రయోజనాల కోసం జగన్ మోదీతో పోరాడాలని జవహర్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి...: TRS MPs boycott from Parliament: పార్లమెంట్​ సమావేశాల నుంచి తెరాస బాయ్​కాట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.