ETV Bharat / city

TDP: నేటినుంచి 'రైతు కోసం తెలుగుదేశం.. వైకాపా తీరుపై నేతల ఫైర్

author img

By

Published : Sep 14, 2021, 12:48 AM IST

Updated : Sep 14, 2021, 1:32 AM IST

సంక్షేమ పథకాల విషయంలో వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా నేతలు మండిపడ్డారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు మంగళవారం నుంచి 5 రోజుల పాటు రైతుల కోసం తెలుగుదేశం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు.

రైతు కోసం తెలుగుదేశం
రైతు కోసం తెలుగుదేశం

రైతుల కోసం తెలుగుదేశం పేరుతో మంగళవారం నుంచి కార్యక్రమం చేపడుతున్నట్లు తెదేపా నేత నిమ్మకాయల తెలిపారు. దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిననాటి నుంచి రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తీవ్ర స్థాయిలో వారు మండిపడ్డారు. ప్రధానంగా పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

''ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే మంగళవారం నుంచి 5 రోజుల పాటు రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమం. సీఎం జగన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకుని రైతుల్ని మోసగించారు. పంట పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల భీమా పథకాలేవీ రైతులకు ఉపయోగపడట్లేదు. 70 శాతం మందికి ఇప్పటికీ ఈక్రాప్ నమోదు పూర్తి కాలేదు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మోటార్లకు మీటర్లు బిగించాలనుకుంటున్నారు. ధరల స్థిరీకరణ నిధి హామీ విస్మరించారు. వైకాపా కార్యకర్తలకు ఉపాధి కోసమే రైతు భరోసా కేంద్రాలు." -నిమ్మకాయల చినరాజప్ప, తెదేపా నేత.

''జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై పడింది. దాతల సహాయ సహకారంతో నడుస్తున్న విద్యాసంస్థలను స్వాధీనంచేసుకొనే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం. ఎయిడెడ్ అధ్యాపకులను, ప్రభుత్వ కళాశాలల్లో నియమించడం ద్వారా దాదాపు 10వేల ఉద్యోగాలభర్తీకి జగన్ ప్రభుత్వం మంగళం. ఎయిడెడ్ సంస్థల్లోని సిబ్బందికి ఇచ్చే జీతాల్లో రాష్ట్రప్రభుత్వ వాటా కేవలం 20 శాతం మాత్రమే. జీతభత్యాల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వసంస్థదే. జాబ్ కేలండర్ అంటూ జాబ్ రిమూవ్ కేలండర్ అమలుచేస్తున్నందుకే నిరుద్యోగులు ఆత్మహత్య.'' - జవహార్, మాజీమంత్రి

''ముఖ్యమంత్రి జగన్ జీవో 217 పేరుతో మత్యకారుల గొంతు కొస్తున్నారు. తక్షణం దానిని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. తెదేపా హయాంలో మత్యకారులకు సబ్సిడీలో వేట అందించిన పరికరాలను నిలిపివేశారు. మత్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే భీమా కూడా వచ్చే పరిస్థితి లేదు. 217 జీవో కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే ఇచ్చామని మంత్రి అప్పలరాజు చెబుతున్నారని, జీవోలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అని ఉంది.'' - కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

''సీఎం జగన్ 2.50 లక్షల పింఛన్ల కోతతో వృద్ధులకు అరణ్య రోదన మిగిల్చారు. ఆచరన సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి అర్హులైన పేదలకు పింఛన్లు రద్దు చేయటం అన్యాయం. రూ.3 వేల పింఛన్ హామీ ఇంతవరకూ అమలు చేయకపోగా ఆసుపత్రులు, పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వృద్ధులపింఛన్ రద్దు చేయటం దుర్మార్గం. విశ్రాంత ఉద్యోగులకు 15వ తేదీ వస్తున్నా ఫించన్ అందట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే ఫించన్ అమలు హామీ ఏమైంది. మంజూరు చేసి పంపిణీ చేయని రెండున్నర లక్షల ఫించన్లు తక్షణమే ఇవ్వాలి." - డోలా వీరాంజనేయ స్వామి, తెదేపా నేత

''ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై 43 దురాగతాలు. అక్బర్ బాషా పొలం కబ్జా చేసిన తిరుపాల్ రెడ్డి, సహకరించిన సీఐ కొండారెడ్డిలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ముస్లింల ఆస్తులు కబళించే వారికి ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా ముస్లింలను తన పదవికోసం వాడుకుని మతకల్లోలాలు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి ముస్లింల ఆస్తులు కాజేస్తూ, వక్ఫ్ భూములు మింగేస్తూ, వారిపై దాడులను ప్రోత్సహిస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలి. ముస్లిం సోదరులు వాస్తవాలు గ్రహించాలి. అక్బర్ బాషా కుటుంబం పరామర్శకు వెళ్లిన ఫారూక్ షుబ్లీ పై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయటం దుర్మార్గం." -సయ్యద్ రఫీ, తెదేపా అధికార ప్రతినిధి

ఇదీ చదవండి:

విద్యుత్ బకాయిలపై.. తెలంగాణ హైకోర్టులో ఏపీ జెన్‌కో పిటిషన్

Last Updated : Sep 14, 2021, 1:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.