ETV Bharat / city

అన్నీ అయిపోయాయి.. ఇక హత్య కేసులు పెడుతున్నారు: తెదేపా - కొల్లు రవీంద్ర అరెస్ట్ తాజా వార్తలు

కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైకాపా కక్ష సాధింపునకు నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీసీ నాయకులపై ఎందుకింత పగబట్టారని నిలదీశారు. ఏసీబీ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోవటంతో ఇప్పుడిక తమపై హత్య కేసులు పెడుతున్నారంటూ తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు.

tdp leaders respond on kollu ravindra arrest
వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు
author img

By

Published : Jul 4, 2020, 8:27 AM IST

tdp leaders respond on kollu ravindra arrest
వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు

బీసీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వారిపై ముఖ్యమంత్రి ఎందుకింత పగబట్టారని నిలదీశారు. కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉన్మాద చర్యని మండిపడిన చంద్రబాబు.. ప్రలోభాలకు లొంగకుండా దుర్మార్గాల్ని ప్రశ్నిస్తే ఎంతకైనా తెగిస్తారా అని దుయ్యబట్టారు. వైకాపాకు అలవాటైన హత్యా రాజకీయాల్ని తెదేపా నేతలకు అంటగడుతున్నారని మండిపడ్డారు. తెదేపాకి బీసీలే వెన్నెముక అన్న అక్కసుతో బీసీ నాయకత్వాన్ని అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు. దీనికి ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

దుశ్చర్యలను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందన్న చంద్రబాబు.. బీసీ నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారిపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై అన్ని విధాలా పోరాడతామని తేల్చిచెప్పారు. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదన్న ఆయన.. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదన్నారు. బీసీలంటేనే వైకాపా పగబట్టిందని.. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు.

ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్టులను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చంద్రబాబు.. ఆయన భార్య, మామ నర్సింహారావులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రవీంద్ర ఎన్నడూ వివాదాలకు వెళ్లేవాడు కాదని వారు వివరించగా.. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు ఊరడించారు.

కుటిల రాజకీయాలు

కొల్లు రవీంద్రను హత్యానేరంలో ఇరికించడం వైకాపా కుటిల రాజకీయానికి నిదర్శనమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని లేకుండా చేయాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, తనపై పెట్టిన తప్పుడు కేసులతో పాటు మండలిలో బీదా రవిచంద్రపై దాడి అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు. కేసులు పెడితే బీసీ నాయకత్వం బలహీన పడుతుందనుకోవడం భ్రమని... అంతకుఅంత రాటుదేలుతుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బీసీలను తెదేపాకి దూరం చేయడం అసాధ్యమని... వైకాపా ఎంత కక్ష సాధిస్తే బీసీలు తెదేపాకి అంత దగ్గర అవుతారనేది సీఎం జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

కక్ష సాధిస్తోంది

తెదేపా నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని పొలిట్‌ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో 800 ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చనిపోగా.. వందల మంది దైనందిన జీవితాన్ని కోల్పోయారని విమర్శించారు. మచిలీపట్నం వైకాపా నేత హత్య కేసులో ఆధారాల్లేకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చెయ్యడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

హిట్లరే వారికి ఆదర్శం

వైకాపా నేతలు హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని పాలిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మండిపడ్డారు. ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఒక మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి ఎలా అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. మచ్చలేని నాయకుడు కొల్లు రవీంద్రపై హత్య కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం జగన్‌ అధికార మదానికి నిదర్శనమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలంటే జగన్‌ మండిపడుతున్నారని దుయ్యబట్టారు. బీసీ నాయకత్వాన్ని అణిచివేయడం జగన్‌ తరం కాదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.

ఇవీ చదవండి..

వైకాపా నేత హత్య కేసులో.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.