ఆగస్టు 4న రాష్ట్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో 21 లక్షల 75 వేల 470 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పిందని.. దీని ప్రకారం రాష్ట్రం లెక్కలు బోగస్ అని తేలిందన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం 8 లక్షల 65 వేల టెస్టులు బోగస్ వని తేలిపోయిందని విమర్శించారు. కొన్ని లక్షల టెస్ట్ శాంపిల్స్ పనికి రాకుండా పోయాయని, శాంపిల్స్ సరిగా సేకరించడం లేదని కేంద్రం లెక్కతో తేలిపోయిందని పట్టాభి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా టెస్టింగ్లలో ఏపీ నెంబర్ -1 కాదని ప్రజలు గ్రహించాలన్నారు. ఆధారాలతో సహా బయటపెట్టిన దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ప్రతి మనిషికి మూడుచొప్పున 15 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఇవ్వలేని ముఖ్యమంత్రికి మూడు రాజధానులు కావాలా అని పట్టాభి ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాల్లో మూడు పూటలా భోజనం పెట్టలేని వాడికి మూడు రాజధానులు కావాలా అని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే ప్రభుత్వంపై, రాష్ట్రంలో జరిగే వైద్యంపై నమ్మకం లేదని.. పేదలకు ఎలా ఉంటుందని నిలదీశారు.
ఇదీ చదవండి: కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి