నందిగామలో టీఎన్ఎస్ఎప్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంపీ సురేశ్కి పూలు ఇచ్చి.. అమరావతికి మద్దతు తెలపాలని మాత్రమే కోరారని.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి.. వారి భవిష్యత్ నాశనం చేయడం సరికాదన్నారు. తెదేపా దళితులకు అండగా ఉంటుందని... దాడి చేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ఎంపీపై దాడి జరిగితే.. వీడియోలు బయటపెట్టాలన్నారు. ఆంగ్లేయుల పాలనలో జై భారత్ అంటే కేసులు పెట్టారని... ఇప్పుడు వైకాపా పాలనలో జై అమరావతి అంటే కేసులు పెడుతున్నారని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నందిగామ పోలీసులకు ఎంపీ సురేశ్ ఫిర్యాదు