మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకునే రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డిలు పింఛన్దార్లను వంచించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. పింఛన్ రూ. 200 చేస్తానన్న రాజశేఖర్ రెడ్డి రూ.100కే పరిమితం చేశారన్నారు. రూ.3వేలు ఫించన్ ఇస్తానన్న జగన్ రెడ్డి రూ. 2,250తో సరిపెట్టి.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.28వేలు ఎగ్గొట్టారని ఆరోపించారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల కడుపుకోత మిగిల్చేందుకే జీవో 174 తీసుకొచ్చారని ఆరోపించారు. 2.25 లక్షల పింఛన్లు తొలగించి ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధన పెట్టి దాదాపు లక్షన్నర మంది పింఛన్ కోల్పోయేలా చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనే విద్వేషం, విధ్వంసం, వినాశనాల కలయికని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది?
నేరస్థులే పాలకులైనప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. చట్ట సభల్లో అత్యధికంగా నేరస్థులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏడీఆర్ నివేదిక చెప్తోందని గుర్తు చేశారు. కేంద్రం నిర్భయ చట్టం అమలుకు కేటాయించిన నిధుల్నీ జగన్రెడ్డి దారి మళ్లించారని ఆరోపించారు.
పక్క రాష్ట్రం ఘటనలపై సెల్యూట్ చేసిన జగన్రెడ్డి ఏపీలో మహిళలపై 500కు పైగా అఘాయిత్యాలు జరిగితే ఒక్క దోషినీ శిక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: