ETV Bharat / city

'ఎమ్మెల్యే రమేశ్​పై సీఎం జగన్​ చర్యలు తీసుకోగలరా?'

ఎమ్మెల్యే జోగి రమేశ్​పై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత రమేశ్ కు ఉందా.. అని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మరోవైపు.. ప్రజాధనం దోపిడీకే నాడు - నేడు పథకాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.

TDP leaders fire on CM Jagan
సీఎం జగన్​పై తెదేపా నేతల ధ్వజం
author img

By

Published : Aug 21, 2021, 6:19 PM IST

ఎమ్మెల్యే జోగి రమేశ్​కు ఏం అర్హత ఉందని డా. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం గురించి మాట్లాడారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సీఎం జగన్..​ కొత్త రాజ్యాంగాన్ని రాస్తున్నాడా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని, బీఆర్ అంబేడ్కర్​ను అవమానించిన జోగి రమేశ్.. నేరం చేసినట్లో కాదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. జోగి రమేశ్​పై చర్యలు తీసుకోవాలంటూ.. డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. హోంమంత్రిని బర్తరఫ్ చేయగల ధైర్యం, జోగి రమేశ్​ను శిక్షించగల దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? అని వర్ల ఈ సందర్భంగా ప్రశ్నించారు.

నాడు-నేడు పథకంలో అవినీతిపై విచారణ: జవహర్

ప్రజాధనం దోపిడీకే నాడు - నేడు పథకం ఏర్పాటు చేశారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఈ పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకుల దోపిడీ పర్వానికి నాడు - నేడు పథకం పనులను అక్షయ పాత్రగా మార్చుకున్నారని విమర్శించారు. రెండేళ్లుగా విద్యా వ్యవస్థను సీఎం జగన్ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని ధ్వజమెత్తారు. పి.గన్నవరం జడ్పీ హైస్కూల్​లో ఎమ్మెల్యే కొండేపి చిట్టిబాబు, సంబంధిత అధికారులు సుమారు రూ. 30 లక్షల పనులు చేయించి రూ. 65 లక్షల నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. వైకాపా నాయకుల దోపిడీకి అధికారులు బలవుతున్నారన్నారు.

పేదలంటే ఇంతటి చిన్న చూపా..?: సయ్యద్ రఫీ

వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సామాజిక పింఛన్లు తొలగించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిదని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ నిలదీశారు. అధికారంలోకి వస్తే రూ. 3 వేలు, 4 వేలు ఇస్తానని చెప్పినా.. రూ. 250 రూపాయలు మాత్రమే పెంచారని విమర్శించారు. ఒక రేషన్ కార్డులో ఒకరికే పింఛన్ ఇస్తామనడం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు పదవులిచ్చే విషయంలో లేని నిబంధనలు.. పేదలకు ఇచ్చే పింఛన్​లకు వర్తిస్తాయా అని సయ్యద్ రఫీ ఆక్షేపించారు. పేదలంటే ముఖ్యమంత్రికి ఎంతటి చిన్నచూపో ఇక్కడే అర్థమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,217 కరోనా కేసులు, 13 మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.