ETV Bharat / city

VARLA RAMAIAH ON YSRCP MPs: తెలుగు భాషను బూతులమయంగా మార్చిన ఘనత వైకాపాదే: వర్ల రామయ్య - మంత్రి బొత్సపై పంచుపర్తి అనురాధ ఫైర్

VARLA RAMAIAH ON YSRCP MPs: బూతులను అసెంబ్లీ నుంచి పార్లమెంట్​కు తీసుకువెళ్లిన ఘనత వైకాపా ఎంపీలకే దక్కిందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. వైకాపా నేతలకు తెలుగు క్లాసులు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని వర్ల పేర్కొన్నారు.

తెదేపా నేత వర్ల రామయ్య
VARLA RAMAIAH ON YSRCP MPs
author img

By

Published : Dec 7, 2021, 6:15 PM IST

VARLA RAMAIAH ON YSRCP MPs: తెలుగు భాషను బూతులమయంగా చేసిన ఘనత వైకాపాదేనని తెదేపా పోలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. బూతులను ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్​కు తీసుకువెళ్లిన ఘనత వైకాపా ఎంపీలకే దక్కిందన్నారు. పార్లమెంట్​లో బూతులు మాట్లాడిన వైకాపా ఎంపీలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా నేతలకు తెలుగు క్లాసులు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని వర్ల అన్నారు. అధికారం ఉందని ఏదిపడితే అది మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీడీవోను బెదిరించిన వైకాపా నేతపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వాళ్లు రాజ్యాగం గురించి మాట్లాడటం హాస్యాస్పదం: పంచుమర్తి అనురాధ

Panchumarthi Anuradha fire on Minister Botsa: తూర్పుగోదావరి జిల్లాలో నాటు సారా పంపిణీ చేసిన బొత్స సత్యనారాయణ.. రాజ్యాగం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. వోక్స్ వ్యాగన్ కంపెనీ పెట్టేందుకు జర్మనీ నుంచి వ్యక్తి ఏమయ్యారో మంత్రి బొత్స చెప్పాలని అనురాధ డిమాండ్‌ చేశారు. రూ. 5 వేల కోట్ల ఇళ్ల స్కాం సూత్రధారి ఎవరో మంత్రి చెప్పాలన్నారు. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు కట్టామంటున్న బొత్స.. అవి ఎక్కడున్నాయో చూపించాలన్నారు. యువతను చెడు వ్యసనాలకు అలవాటు చేస్తోంది వైకాపా ప్రభుత్వం కాదా అని అనురాధ మండిపడ్డారు.

అమరావతిలో 25 ఎకరాల్లో రూ. 100 కోట్లతో 125 అడుగుల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయిస్తే.. దాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేని ఆమె ఆక్షేపించారు. కనీసం అంబేడ్కర్ నమూనా విగ్రహాలను చోరీ చేసిన వారిని కూడా ఇంతవరకూ పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం.. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి..: KODALI NANI IN BHADRACHALAM : భద్రాద్రి రామయ్య సేవలో మంత్రి కొడాలి నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.