ETV Bharat / city

TDP Fire On YSRCP: పదవి కోసం కక్కుర్తి పడే రోజాకు ఆ హక్కు లేదు: పంచుమర్తి

TDP Leaders Fire On YSRCP Govt: వైకాపా ప్రభుత్వ విధానాలపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదవి కోసం కక్కుర్తి పడే రోజాకు భువనేశ్వరిపై మాట్లాడే అర్హత లేదని తెదేపా మహిళా నేత పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. తప్పుని ఎత్తిచూపిన సుబ్బారావు గుప్తా అనే వైకాపా కార్యకర్తపై దాడి చేయటమే కాకుండా అతనికి మతిస్థిమితం లేదని దుష్ప్రచారం చేస్తారా ? అని మంత్రి బాలినేనిపై మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మండిపడ్డారు.

పదవి కోసం కక్కుర్తి పడే రోజాకు ఆ హక్కు లేదు

author img

By

Published : Dec 21, 2021, 4:51 PM IST

TDP Leaders Fire On YSRCP Govt: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదంటూ మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రోజా ఒత్తిడిలో నారా భువనేశ్వరీపై అవాకులు చవాకులు పేలుతోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని సూచించారు. చిత్తూరులో వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని...నారా భువనేశ్వరి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. పదవి కోసం కక్కుర్తి పడే రోజాకు భువనేశ్వరిపై మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. భువనేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తప్పుని ఎత్తిచూపిన సుబ్బారావు గుప్తా అనే వైకాపా కార్యకర్తపై దాడి చేయటమే కాకుండా అతనికి మతిస్థిమితం లేదని దుష్ప్రచారం చేస్తారా? అని మంత్రి బాలినేనిపై మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మండిపడ్డారు. ఆడబిడ్డలను దూషించటం తప్పని చెప్పటమే సుబ్బారావు చేసిన తప్పా ? అని ప్రశ్నించారు. సుబ్బారావు ఘటనతో పాటు, రాజంపేటలో లక్ష్మీకాంతప్రసాద్, విశాఖలో జగదీశ్వరుడి ఘటనలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారన్నారని నిలదీశారు.

వైకాపా కార్యకర్త సుబారావు గుప్తాపై జరిగిన దాడిని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు శివ శర్మ ఖండించారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మౌనం వహించటాన్ని ఆయన తప్పుబట్టారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడికి పాల్పడితే స్పందించకపోవటం దారుణమన్నారు. మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా ?, లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా ? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: YCP Activists Attack: తెదేపా మద్దతుదారుడిపై వైకాపా కార్యకర్తల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.