రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులకు సకాలంలో చెల్లింపులు చేయలేని ముఖ్యమంత్రి జగన్.. ఆలస్యంగా బకాయిలు విడుదల చేయటాన్ని కూడా అన్నదాతలకు చేసిన సాయంగా చెప్పుకోవటం సిగ్గుచేటని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి(Mareddy Srinivas Reddy on ysr rythu bharosa) విమర్శించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆగస్టులోనే డబ్బులిస్తే వాటిని దారిమళ్లించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మీటలు నొక్కుతున్నారని మండిపడ్డారు. 2020 డిసెంబర్లో కూడా రైతులకు సంక్రాతి ముందే వచ్చిందని మీటనొక్కి డబ్బులు 2021 ఫిబ్రవరిలో జమచేశారన్నారు.
ఆగస్టులో చెల్లించాల్సిన డబ్బుల్ని ఇప్పుడిస్తూ.. దీపావళి ముందే వచ్చిందంటూ పెద్ద పెద్ద ప్రకటనలిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ కింద ఏటా రూ. 400కోట్లు చెల్లిస్తే, వైకాపా ప్రభుత్వం ఐదేళ్లకు ఇచ్చేది కేవలం రూ. 480కోట్ల మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులకుగాను కేవలం 6లక్షల మందికే అరకొరసాయాన్ని పరిమితం చేశారని మండిపడ్డారు. సొంత మీడియాకు ఏదో రూపేణా ప్రకటనలిచ్చుకునేందుకు రైతుల పేరు చెప్పి మోసగిస్తున్నారన్నారు. పచ్చని పొలాల్ని బీళ్లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు కట్టపెట్టే కుట్రలో భాగంగానే సున్నా వడ్డీ, పంటలబీమా, రైతుభరోసా పథకాల్లో కోతలు పెడుతున్నారని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి(Mareddy Srinivas Reddy on cm jagan) దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు జగన్ సిగ్గుపడాలి: కొనకళ్ల నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లో మగ్గుతోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ రెడ్డి సిగ్గుపడాలని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ధ్వజమెత్తారు(Former MP Konakalla Narayana comments on cm jagan). అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం జగన్పై మండిపడ్డారు. "జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి విద్యుత్ లోటు ఏర్పడి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోయాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. రూ.5లక్షల కోట్ల వరకూ చేస్తున్న అప్పులు ఎందుకోసమో ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జగన్ రెడ్డి సాగిస్తున్న స్నేహ సంబంధాలు.. ఆయా రాష్ట్రాలకు వరంగాను, ఏపీకి శాపంగాను మారుతున్నాయి. తెలంగాణ ముందుకుపోతుంటే, ఏపీ వెనుకపడటం బాధాకరం. కేసీఆర్కు శాలువాలు కప్పి, స్నేహబంధాలు నేర్పడం కంటే తనను ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో జగన్ రెడ్డి ఆలోచించాలి." అని హితవు పలికారు.
ఏ1, ఏ2ల గురించి కన్నబాబు ఏం చెప్తారు: చినరాజప్ప
స్వప్రయోజనాల కోసం ప్రధానిని పదే పదే కలుస్తున్న ఏ1, ఏ2ల గురించి మంత్రి కన్నబాబు ఏం సమాధానం చెప్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చిన్నరాజప్ప(tdp leader Chinarajappa comments on minister kannababu) నిలదీశారు. రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు చంద్రబాబు రాష్ట్రపతిని కలిస్తే.. లేని నోటుకు ఓటు అంశాన్ని వైకాపా నేతలు ఎత్తటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి కోసం ప్రజలు.. జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే, కక్ష సాధింపు చర్యలకే పరిమితమై రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిని గాలికొదిలి ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం వైకాపా ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని ఓ ప్రకటనలో మండిపడ్డారు.
ఇదీ చదవండి..