వాలంటీర్లకిచ్చిన జీతాల పెంపు హామీని సీఎం జగన్ ఎందుకు పట్టించుకోవట్లేదో సమాధానం చెప్పాలని.. తెదేపా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. వాడుకుని అన్యాయం చేసే నైజాన్ని చిరుద్యోగులపై చూపటం అత్యంత హేయమని దుయ్యబట్టారు. ప్రతి ప్రభుత్వ పనికీ వాలంటీర్లను వాడుకుని వేతనాల చెల్లింపులో వివక్ష చూపటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఏడాది క్రితమే వేతనాలను రూ. 8 వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించి.. ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. ఇటీవలే ప్రారంభించిన రేషన్ వాహనాల నిర్వహణ, వారి వేతనాలను ఒక్కసారిగా రూ. 5 వేలు పెంచి వాలంటీర్లపై లాఠీలు ఝుళిపించడం, హింసించడం ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమంటూ నేతలు మండిపడ్డారు. వెంటనే వాలంటీర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: