ETV Bharat / city

వైకాపా ఆర్థిక అరాచకం.. ప్రజలకు తెలియకుండానే వారిపై అప్పు భారం: తెదేపా - తెదేపా తాజా వార్తలు

TDP Leaders Fire Jagan Govt: వైకాపా ప్రభుత్వ విధానాలు, అసమర్థ పాలనపై తెదేపా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో భౌతిక, రాజకీయ అరాచకంతోపాటు ఆర్థిక అరాచకం కూడా పెరిగిపోతోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆక్షేపించారు. వైకాపా నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని.., ఇకనైనా అలాంటి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ హితవు పలికారు.

TDP Leaders Fire Jagan Govt
TDP Leaders Fire Jagan Govt
author img

By

Published : Feb 24, 2022, 1:03 PM IST

TDP Leaders Fire YSRCP Govt: రాష్ట్రంలో భౌతిక, రాజకీయ అరాచకంతోపాటు ఆర్థిక అరాచకం కూడా పెరిగిపోతోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ఆర్థిక నేరాలతో తాము ఎలా నష్టపోతున్నామో కూడా ప్రజలకు తెలియట్లేదని అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు తీర్చేందుకు ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం మోపారని మండిపడ్డారు. స్కీంలు స్కామ్​లు తప్ప రాష్ట్రంలో బడ్జెట్ అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే ఏపీ పవర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఐపీ పెట్టే స్థాయికి వచ్చిందని, రేపు రాష్ట్రానిదీ అదే పరిస్థితి అని దుయ్యబట్టారు.

ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోగా.., అణగదొక్కిందని అశోక్‌బాబు విమర్శించారు. ఉద్యోగులు పీఆర్సీ నివేదికను కోర్టు ద్వారా సాధించటంతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందని అన్నారు. కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ఖర్చు అయిందని సీఎస్ ఉద్యోగులకు చెబితే.., ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖలో అది రూ.8 వేల కోట్లేనని పేర్కొన్నారని గుర్తు చేశారు. రూ.97 వేల కోట్లు బడ్జెట్​తో సంబంధం లేకుండా ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించినా.. తమకు సంబంధం లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఉన్న అప్పును తీర్చటానికి ఎక్కువ వడ్డీకి మళ్లీ అప్పులు తెస్తున్నారన్నారు.

ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి..

వైకాపా నేతలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలనే తాను గౌతమ్ రెడ్డి మరణంపై స్పందించానని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయినపుడు వైకాపా నేతలు చేసింది శవ రాజకీయమని అన్నారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ చావుకు చంద్రబాబు కారణం అని కొడాలి నాని శవరాజకీయం చేశారని గుర్తు చేశారు. వివేకా హత్యను చంద్రబాబుకి అంటకడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తనకు ఫోన్ చేసి ఎన్నో రకాలుగా బెదిరిస్తున్నారని.., తాను వేటికీ భయపడననని బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

CBN and Lokesh on Amaravati: 'జగన్ తప్పులను చరిత్ర క్షమించదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.