ETV Bharat / city

'రంగనాయకమ్మ ప్రశ్నలనే మేం సంధిస్తాం.. సీఐడీ నోటీసులివ్వండి' - రంగనాయకమ్మ అరెస్టు న్యూస్

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన వృద్ధురాలు రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులివ్వడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఘటనకు కారణమైన కంపెనీని ప్రభుత్వం వెనకేసుకొస్తూ ఇదేమిటని ప్రశ్నించే వారిపై కేసులేంటని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంగనాయకమ్మ ప్రశ్నలనే తామూ సంధిస్తాం అంటూ.. ట్విట్టర్‌ వేదికగా తెలుగుదేశం నేతలు ఎదురుదాడికి దిగారు.

tdp leaders comments on ysrcp govt about ranganayakamma cid notices issue

author img

By

Published : May 19, 2020, 11:45 PM IST

12 మందిని చంపి, వంద‌ల మందిని ఆసుపత్రి పాల్జేసిన‌ ఎల్జీ యాజ‌మాన్యంతో ప్రభుత్వం ఎందుకు లాలూచీ ప‌డింద‌ని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు నిలదీశారు. కంపెనీ ప్రతినిధులను ఎందుకు వ‌దిలేశార‌ని తానూ నిల‌దీస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విష‌యంపై రంగనాయకమ్మ లాగా తానూ ప్రశ్నిస్తున్నాను, సీఐడీ నోటీసులు తనకూ ఇవ్వడంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. గ్యాస్‌లీక్ చేసి 12 మందిని పొట్టన‌బెట్టుకున్నప్పుడు సీఐడీ ఏమైందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వంద‌ల‌మంది ఊపిరాడ‌క ఆస్పత్రిలో చేరితే సీఐడీ రాలేదన్న ఆయన ఫ్యాక్టరీ యాజ‌మాన్యాన్ని మృతుల త‌ర‌ఫున ఓ బాధ్యత క‌లిగిన మ‌హిళ ప్రశ్నిస్తే మాత్రం వచ్చి నోటీసులివ్వడానికి చ‌ట్టమేమైనా ఎల్జీకి చుట్టమా అని ట్విట్టర్‌లో విమర్శలు సంధించారు.

సోషల్ మీడియాలో పోస్టుపెట్టిన 66 ఏళ్ల రంగనాయకమ్మపై అక్రమకేసు పెట్టారంటూ మాజీమంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. సోష‌ల్ మీడియా పోస్టుల‌కే జగన్‌ భ‌య‌ప‌డి చ‌స్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. మార్ఫింగు లేకుండా ఫేక్ కాకుండా సూటిగా ఒక మ‌హిళ అడిగిన ప్రశ్నలకు ఏ రకంగా సీఐడీతో నోటీసులు ఇప్పించారని నిలదీశారు. ప్రశ్నిస్తే జ‌డుసుకుని రంగనాయకమ్మ అరెస్టుకు సీఐడీని దింపి తాను పులికాదు, పుల‌కేశి అని జగన్‌ నిరూపించుకున్నాడని మాజీమంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి విమర్శించారు. ఏపీ పోలీసులు ప్రజ‌ల కోసం కాకుండా ప్రభుత్వం కోసమే ప‌నిచేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు.

మాస్కుల్లేవని ప్రశ్నించిన వైద్యుడ్ని స‌స్పెండ్ చేసి ఇప్పటికే ప్రభుత్వం వెంటాడి వేధిస్తోందని మాజీ మంత్రి జవహర్‌ దుయ్యబట్టారు. 12 మంది మృతికి కార‌ణ‌మైన‌ ఎల్జీ పాలిమార్స్ యాజ‌మాన్యాన్ని అరెస్ట్ చేయ‌లేద‌ని బాధ్యత‌ కలిగిన ఓ పౌరురాలు ప్రశ్నిస్తే ఏకంగా సీఐడీతో ఐదేళ్ల శిక్ష విధించే సెక్షన్ కింద నోటీసులేంటని ఆయన నిలదీశారు. ఎల్జీ పాలిమర్స్ విస్తర‌ణ‌కు, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇచ్చిన జ‌గ‌న్‌ స‌ర్కారు 12 మంది మృతికి కార‌ణ‌మైన ఎల్జీ యాజ‌మాన్యానికి ఎందుకు కొమ్ము కాస్తుందో అని రంగ‌నాయ‌కి సామాజిక మీడియాలో అడిగిన ప్రశ్నలో తప్పేంటని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆక్షేపించారు. ప్రజల త‌ర‌ఫున తామూ అవే ప్రశ్నలు అడుగుతున్నామని ఇందుకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్​కు ఎకరా కూడా కేటాయించలేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.