పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ధీటుగా.. తెదేపా మద్దతుదారులు గెలవటంతో వైకాపా నాయకులు తట్టుకోలేకపోతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. నమ్మి ఓట్లేస్తే సీఎం జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో అసలు కారకులెవరో ప్రజలకు తెలీదనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో "వీసా'ఖపతనం"
తెలుగుదేశం హయాంలో 'విశాఖ'పట్నం అంటే.. వైకాపా ప్రభుత్వ హయాంలో "వీసా'ఖపతనం" అంటున్నారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌పై సీఎం జగన్ స్పందించకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రజలు వైకాపాకి గుణపాఠం చెప్పాలి..
ప్రజల మధ్యకు వెళ్లి ఓటు అడిగే హక్కు వైకాపాకు లేదని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. అన్ని రంగాల ప్రజలను వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు ద్వారా ప్రజలు.. వైకాపాకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
వైకాపా అసమర్థ పాలన చివరి దశకు చేరుకుందని తెదేపా నేత, మాజీమంత్రి జవరహర్ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రాజ్యాంగా వ్యవస్థలను అవమానిస్తూ తెదేపా గురించి మాట్లాడితే ఎలా అని నిలదీశారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు: కొడాలి నాని