ETV Bharat / city

'దేవాలయాలపై దాడులకు నిరసనగా పూజలు' - అంతర్వేదిలో రథం దగ్ధం వార్తలు

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా వచ్చే ఆదివారం నుంచి శనివారం వరకు దేవాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తెలిపారు.

'దేవాలయాలపై దాడులకు నిరసనగా పూజలు'
'దేవాలయాలపై దాడులకు నిరసనగా పూజలు'
author img

By

Published : Sep 10, 2020, 4:11 PM IST

ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు రాజోలు బందు చేపట్టినట్లు నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, పూజారులపై దాడులు జరుగుతున్నాయని, గోశాలల్లో గోవుల మృతి, పోషణ నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతోందని నేతలు మండిపడ్డారు.

దేవాలయాల భూముల కబ్జాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫ్యల్యం చెందిందని విమర్శించారు. ఆదివారం – అరసవెల్లి దేవాలయం, సోమవారం శివాలయాల్లో, మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి గుళ్లు, బుధవారం అయ్యప్ప మందిరాలు, గురువారం సాయిబాబా మందిరాల్లో, శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో శనివారం వైష్ణవ ఆలయాల్లో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని నేతలు కోరారు.

అంతర్వేది ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

అంతర్వేది ఘటనపై కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించి నిజాలు బహిర్గతం చేయాలని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. అంతర్వేది ఘటన ఒక మతంపై జరిగిన దాడిగా చూడాలన్నారు. రథం దగ్ధం కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తితిదే విషయంలోనూ అనేక వివాదాలు నడుస్తున్నాయని అమర్నాథ్​రెడ్డి విమర్శించారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.