ETV Bharat / city

జిల్లాల్లో జోరుగా తెదేపా నేతల ప్రచారం

author img

By

Published : Mar 4, 2021, 9:55 PM IST

మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తెదేపా నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తూ.. అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ తెదేపానేనని స్పష్టం చేస్తున్నారు.

TDP leaders campaign
జోరుగా తెదేపా నేతలు ప్రచారం

వైకాపా బెదిరింపులు, దాడులు హేయమైన చర్యగా నూజివీడు తెదేపా ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను బెదిరించి భయపెట్టడం దారుణమని తెదేపా కార్యాలయంలో మండిపడ్డారు. మున్సిపాలిటీలో తెదేపా విజయం వైకాపా కళ్ళకు కనిపించడంతో, బెదిరింపులకు తెగబడ్డారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా జరిగే ఏకగ్రీవాలు సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించిన ఆయన అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సీఐలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి కోరుకునే ప్రతి ఒక్కరూ..

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన అంశమని తెదేపా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామమోహనరావు అన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు భావితరాల భవిష్యత్ మార్పునకు నాంది కావాలన్నారు. అమరావతి కోరుకునే ప్రతి ఒక్కరూ.. ఓటుతో వైకాపాకు గుణపాఠం చెప్పాలని కోరారు. 15వ డివిజన్​ తెదేపా అభ్యర్థిని రత్నం రజినీ తరుపున ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచూతూ.. తెదేపాకు ఓటు వేసి.. రత్నం రజినీని గెలిపించాలని కోరారు.

ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయం..

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో తెదేపా వైకాపా అభ్యర్థులు జోరు పెంచారు. వైకాపా అభ్యర్థుల తరుపున ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెదేపా తరుపున మాజీ ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే కనిపించే వైకాపా అభ్యర్థులతో నగర అభివృద్ధి అసాధ్యమన్నారు.

నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపాను గెలిపించాలి..

సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ కేశినేని నాని, కనకమేడల రవీంద్ర ప్రచారంలో పాల్గొన్నారు. నగరం తెదేపా హయాంలో ఎంతగా అభివృద్ధి చేందింది ప్రజలకు తెలుసునని రవీంద్ర అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపాకు ఓటు వెయ్యాలని ఎంపీ కేశినేని నాని కోరారు.

గూడురులో జోరుగా తెదేపా ప్రచారం..

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఎన్నికల్లో 10వ వార్డులో తెదేపా తరఫున ప్రచారం నిర్వహించారు. మాజీ నగర పంచాయతీ చైర్మన్ రామాంజనేయులు సమక్షంలో.. ఇంటింటికి తిరుగుతూ.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు రేమట వెంకటేష్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్ద ఎత్తున తెదేపా శ్రేణుల ప్రచారం..

విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో.. తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ శ్రీదేవి ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. 20 , 21 వార్డుల్లో ప్రచారం చేపట్టిన వారు.. తమ పార్టీ అభ్యర్థులను పరిచయం చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు.

ఇవీ చూడండి...

'రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితి కనిపిస్తోంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.