ETV Bharat / city

arrest: 'చలో తాడేపల్లి'కి పిలుపు... నాయకుల ముందస్తు అరెస్టులు - tdp leaders arrest due to call to Chalo Thadepalli

జాబ్ క్యాలెండర్(job calendar)​ను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు సోమవారం (19న) సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నాయకుల అరెస్టులపర్వం కొనసాగుతోంది. నిరుద్యోగులకు మద్దతుగా చలో తాడేపల్లి(Chalo Thadepalli)కి తెదేపా(TDP) పిలుపునివ్వడంతో నిరుద్యోగ సంఘాల నాయకులతో పాటు తెదేపా నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ముట్టడికి అనుమతి లేదని గుంటూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే 'చలో తాడేపల్లి' కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి.

tdp call to Chalo Thadepalli
ఛలో తాడేపల్లికి తెదేపా పిలుపు.
author img

By

Published : Jul 18, 2021, 5:51 PM IST

Updated : Jul 18, 2021, 9:25 PM IST

జాబ్ క్యాలెండర్​ను నిరసిస్తూ.. విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రేపు(ఈనెల19) సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. నిరుద్యోగులకు మద్దతుగా 'చలో తాడేపల్లి'(Chalo Thadepalli)కి తెదేపా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ సంఘాల నాయకులతోపాటు తెదేపా, టీఎన్​ఎస్ఎఫ్, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి.

అనంతపురంలో..

చలో తాడేపల్లి నేపథ్యంలో అనంతపురం తెదేపా పార్లమెంట్ ఇన్​ఛార్జీ జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని లక్ష్మీ నగర్​లో ఇంటి వద్ద కార్యకర్తలతో కలిసి సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతుండగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆయనతోపాటు కొంతమంది కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

చంద్ర దండు నాయకులు అరెస్టు..

కొత్త జాబ్ క్యాలెండర్​ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని చంద్ర దండు నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా ఛలో సీఎం కార్యాలయానికి బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడును అనంతపురంలో 4వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇతర నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్​లోనే నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.

విజయవాడలో...
అన్నీ ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్​తో చలో తాడేపల్లికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీంతో రెండు రోజుల ముందు నుంచే విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేశారు. తమకు పరీక్షలు ఉన్నాయని చెప్పినా వినకుండా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని రాష్ట్ర ఉద్యోగ పోరాట సమితి నాయకులు లెనిన్ బాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత మందిని అరెస్టు చేసిన చలో తాడేపల్లి నిర్వహించి తీరుతామని లెనిన్ బాబు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా ఆత్మకూర్​లో తెదేపా, టీఎన్​ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ముట్టడికి బయలుదేరిన టీఎన్​ఎస్​ఎఫ్(TNSF) నాయకులను ఆత్మకూర్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించిన తిరుపతి నాయుడు, మోహన్, రవి, తదితరులు.. చంద్రబాబు జిందాబాద్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేయగా.. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.

కడపలో..

చలో తాడేపల్లి కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థి సంఘ నాయకులను కడప పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులను కడప రైల్వే స్టేషన్​లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ అన్నారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 10 వేల ఉద్యోగాలను విడుదల చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.

తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నిరసన

నరసరావుపేట తెలుగునాడు విద్యార్థి సమాఖ్య సభ్యులు స్థానిక తెదేపా కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు చలో తాడేపల్లి కార్యక్రమానికి వెళ్తున్న తెలుగు యువత, తెలుగు విద్యార్థి నాయకులను నరసరావుపేట పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తిరుపతిలో విద్యార్థి సంఘాల నేతలు అరెస్టు

తిరుపతిలో టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీగా తాడేపల్లికి బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులను ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకొని ఎస్వీయూ పోలీస్ స్టేషన్​కు తరలించారు. నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి.... తమ నిరసనలను అడ్డుకోవడం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయలేరని నేతలు ధ్వజమెత్తారు.

అరెస్టులతో పోరాటాలను ఆపలేరు: నాదెండ్ల బ్రహ్మం

ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల పాలిట నరకాసురుడుగా ముఖ్యమంత్రి జగన్​ మారారని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. మొత్తం ఖాళీలతో కొత్త క్యాలెండర్​ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పది వేల ఉద్యోగాల క్యాలెండర్​ను చూసి సొంత పార్టీ వాళ్లే ఛీ కొడుతున్నారన్నారు. యువత, విద్యార్థి నాయకులని అరెస్టు చేసినంత మాత్రాన పోరాటాలు ఆగవని హెచ్చరించారు.

విద్యార్థి సంఘాల నేతల గృహనిర్బంధం దారుణం

న్యాయబద్ధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమంటే..విద్యార్థి, యువజన సంఘాల నాయకులను గృహనిర్బంధం చేయడం దారుణం అని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. విశాఖ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

ఇదీ చదవండి..

వైకాపాకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తాం: అచ్చెన్నాయుడు

Last Updated : Jul 18, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.