ప్యానెల్ జాబితాలో జూనియర్‌గా ఉన్న సుబ్బారెడ్డికి సర్వీస్ కోడ్ నియమావళికి విరుద్ధంగా ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వేతనం తీసుకునేలా పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయటంపై తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో కీలక బాధ్యత పోషించే ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవిని విశ్రాంత ఉద్యోగికి అడ్డగోలుగా కట్టబెట్టాల్సిన అవసరమేంటని నిలదీశారు. నిధులను దారి మళ్లించేందుకే అడ్డదారిన పదవి ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇంజినీర్లకు అన్యాయం చేసేలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా అన్యాయానికి గురవుతున్న ఎస్సీలు వైకాపా పాలనలో మోసాన్ని గ్రహించాలని కోరారు.
ఇదీ చదవండి: Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..!