సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార వైకాపాలో కనిపిస్తోందని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం వదిలి.. వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు ప్రజల్లోకే వెళతామని అన్నారు. వాళ్లే ఏది సరైందో నిర్ణయిస్తారని అన్నారు.
సభలో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. నోరు జారినప్పడు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డితోపాటు తాను సైతం సరిదిద్దుకునే ప్రయత్నం చేశామని యనమల గుర్తుచేశారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు అలా లేవని అన్నారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులను అవమానిస్తూ(YSRCP leaders Abuse Chandrababu wife) సీఎం జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి శాడిజం తోటి సభ్యుల్ని ప్రోత్సహించేలా ఉందని ధ్వజమెత్తారు. దాంతో.. తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికారపక్షం లేదన్నారు.
ఆ మాటల్ని రికార్డ్స్ నుంచి తొలగించారు..
అసెంబ్లీలో నిన్న వైకాపా సభ్యులు మాట్లాడిన మాటలను రికార్డ్స్ నుంచి తొలగించారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు పశువుల్లా మాట్లాడారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా వైకాపా నేతల వ్యాఖ్యలు ఉన్నాయన్న ఆయన.. 'వివేకా హత్య గురించి అసెంబ్లీలో మాట్లాడాలి' అని అడగటం తప్పా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: CHANDRABABU: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి చంద్రబాబు ఇలా..