జిల్లా పునర్విభజన వల్ల రాష్ట్రంలోని ప్రజల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందంటూ తెదేపా నేత వర్ల రామయ్య సీఎం జగన్కు లేఖ రాశారు. కొన్ని జిల్లాలకు కొందరి మహానీయుల పేర్లు వారి గౌరవార్థం పెట్టారని, మరికొన్నింటికి రాజకీయ లబ్ధి కోసం పెట్టినట్లుగా భావించాల్సి వస్తోందన్నారు. దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి.. దళిత వర్గాలకు చెందిన మహానీయుల పేర్లు కొన్ని జిల్లాలకు పెట్టకపోవటంపై వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత వర్గాలను ఓటు బ్యాంకుగానే భావించి, చిన్న చూపు చూడటం.. ఆ వర్గాలపై దాడులు జరిగినా పెద్దగా స్పందించకపోవడం..వారి పట్ల ముఖ్యమంత్రి జగన్కు ఉన్న అభిప్రాయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కోనసీమ జిల్లాను డా. బీఆర్. అంబేడ్కర్ జిల్లా, నరసరావుపేట జిల్లాకు గుర్రం జాషువా జిల్లా, బాపట్ల జిల్లాకు బాబు జగజ్జీవన్ రామ్ జిల్లాగా పేర్లు పెట్టాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: 'అతడో ఆర్మీ జవాన్.. పోర్న్ చూసే అలవాటు ఉంది.. కామ వాంఛ తీర్చుకునేందుకు..'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!